దంచికొట్టిన సన్‌‌రైజర్స్ ..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ..పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కు SRH

 దంచికొట్టిన సన్‌‌రైజర్స్ ..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ..పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కు  SRH
  •  
  • కూపర్​ కానొల్లీ సెంచరీ వృథా

హైదరాబాద్: ​ సొంత గడ్డపై సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌ అదరగొట్టింది. బ్యాటర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌‌‌‌ పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. క్లాసెన్ (43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69),  ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 55) పరుగుల వరద పారించారు. దీంతో సన్‌‌‌‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ తడబడింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు నిలవలేకపోయారు. కూపర్ ​కానొల్లి (59  బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.  స్టోయినిస్ ​(28), సూర్యాన్ష్ ​షెడ్జె (25) పర్వాలేదనిపించారు. మొత్తంగా పంజాబ్​20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.  దీంతో సన్​ రైజర్స్​ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సన్​రైజర్స్​14 పాయింట్లతో మొదటి స్థానానికి ఎగబాకింది. ' ప్లేయర్​ఆఫ్​ ద మ్యాచ్ ' పాట్ ​కమిన్స్​కు దక్కింది.
అభిషేక్, ట్రావిస్​ మెరుపులు..
టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్ ​రైజర్స్​కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ​అభిషేక్ శర్మ (13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35), ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38) వేగంగా ఇన్నింగ్స్‌‌‌‌ను  ప్రారంభించారు. 21 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ నిష్క్రమించాక, క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 55) పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ 48 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్​28 బంతుల్లో, క్లాసెస్​32 బంతుల్లో హాఫ్​సెంచరీలు పూర్తిచేసుకున్నారు. సన్ ​రైజర్స్​ పవర్​ప్లే ముగిసేసరికి ఒక్క వికెట్ ​కోల్పోకుండా 79 పరుగులు సాధించింది. ఇక చివర్లో  నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్​లతో 29)  ధాటిగా ఆడి నాటౌట్​గా నిలిచాడు. ఇక విజయ్ ​కుమార్ ​వేసిన 19 ఓవర్​చివరి బంతికి మార్కో యాన్సన్​కు క్యాచ్​ఇచ్చి క్లాసెస్ అవుటయ్యాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో స్కోరు 235 పరుగుల వద్ద ఆగింది.  పిచ్ బ్యాటింగ్‌‌‌‌కు పూర్తిగా అనుకూలించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. చాహల్ బౌలింగ్‌‌‌‌లో ఫీల్డర్లు క్యాచ్‌‌‌‌లు జారవిడవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎస్ఆర్‌‌‌‌హెచ్ ఇన్నింగ్స్‌‌‌‌లో 17 సిక్సర్లు నమోదయ్యాయి. అభిషేక్ శర్మ 4, హెడ్ 3, కిషన్ 4, క్లాసెన్ 4 సిక్సర్లతో అలరించారు. మార్కో జాన్సన్ (0/61), అర్ష్‌‌‌‌దీప్ సింగ్ (1/43) ఎనిమిది ఓవర్లలోనే 100 పరుగులు సమర్పించుకున్నారు. 
కూపర్ ​కానొల్లీ ఒంటరి పోరాటం..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​కు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది. కమిన్స్​ వేసిన మొదటి ఓవర్​లో ఓపెనర్ ప్రియాంశ్​ఆర్య (1) మలింగకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్​లో మరో ఓపెనర్​ ప్రభ్​మన్​ సింగ్​(3) నితీశ్ ​బౌలింగ్​లో కమిన్స్​కు క్యాచ్​ఇచ్చి పెవిలియన్​ చేరాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ ​రెండు వికెట్లు కోల్పోయి 10  పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కెప్టెన్ ​శ్రేయస్ ​అయ్యర్ (5) మలింగ బౌలింగ్​లో కమిన్స్​కు క్యాచ్​ఇచ్చి నిరాశపరిచాడు. ఈ క్రమంలో కూపర్ కానొల్లీ, స్టోయినిస్​(14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 28) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 20 బంతుల్లో 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్​ప్లే ముగిసేసరికి పంజాబ్ స్కోరు 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 7 ఓవర్​లో స్టోయినిస్ శివాంగ్ ​కుమార్ ​బౌలింగ్​లో కీపర్​ఇషాన్​కు క్యాచ్ ఇచ్చి​ వెనుదిరిగాడు. మొదటి 10 ఓవర్లకు పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. కమిన్స్​ వేసిన 12 ఓవర్​లో షెడ్జే (17 బంతుల్లో 25) అభిషేక్​కు క్యాచ్​ఇచ్చి అవుటయ్యాడు. సకీబ్ ​హుస్సెన్​వేసిన 13 ఓవర్​లో శశాంక్​సింగ్​ (4) నితీశ్​రెడ్డికి క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. ఈ క్రమంలోనే కూపర్​ 34 బంతుల్లో హాఫ్ ​సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడడం ప్రారంభించాడు.  చివరగా శివాంగ్​బౌలింగ్​లో మార్కో యాన్సన్​(19) హర్ష్ ​దూబెకు క్యాచ్​ఇచ్చి అవుటయ్యాడు. కానీ మరో పక్క తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో వేగంగా ఆడుతున్న కూపర్​57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి 107 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.  పాట్​కమిన్స్​4 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.  
సంక్షిప్త స్కోరు:
హైదరాబాద్: 20 ఓవర్లలో 235/4 (క్లాసెన్ 69, ఇషాన్ ​కిషన్ 55, చాహల్​32/1)
పంజాబ్: 20 ఓవర్లలో 202/7 (కూపర్​ కానొల్లీ 107 నాటౌట్, స్టోయినిస్​(28), కమిన్స్​34/2