SRH vs CSK: కమ్మిన్స్‌తో మాములుగా ఉండదు: సన్ రైజర్స్ ఫ్యాన్స్ సైలెన్స్ సెలెబ్రేషన్

SRH vs CSK: కమ్మిన్స్‌తో మాములుగా ఉండదు: సన్ రైజర్స్ ఫ్యాన్స్ సైలెన్స్ సెలెబ్రేషన్

భారత భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కమిన్స్ స్టేట్ మెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సొంతగడ్డపై అభిమానులను సైలెన్స్ గా ఉంచడం కంటే ఆనందం ఏముంటుంది అని ఫైనల్ కు కమ్మిన్స్ అన్నాడు. గెలవడంలో మజా ఉంటే ఛాలెంజ్ చేసి గెలిస్తే ఆ కిక్ వేరే లెవల్ ఉంటుంది. కమ్మిన్స్ కూడా ఇదే చేసి చూపించాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఫైనల్లో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 6 వికెట్ల తేడాతో గెలిచి ఆసీస్ విశ్వ విజేతగా అవతరించింది. 

కమ్మిన్స్ చెప్పినట్లుగానే ఆ రోజు టీమిండియా ఫ్యాన్స్ నోరు మూయించాడు. గ్రౌండ్ అంతా నిశబ్ధంగా మారిపోయింది. ఇదిలా ఉండగా ఇదే సీన్ మళ్ళీ హైదరాబాద్ లో రిపీటైంది. హైదరాబాద్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న ధోనీ కోసం ఉప్పల్ స్టేడియం మొత్తం చెన్నై ఫ్యాన్స్ తో నిండిపోయింది. ఎల్లో జెండాలతో హోరెత్తింది. చెన్నై గెలుపు కోసం వచ్చిన వారికి బిగ్ షాక్ తగిలింది. కమిన్స్ అద్భుత కెప్టెన్సీతో సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

సొంతగడ్డపై చెన్నైని సన్ రైజర్స్ చిత్తుడు చేయడంతో ఫ్యాన్స్ సైలెన్స్ సెలెబ్రేషన్ చేసుకున్నారు. చెన్నై ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండాలంటూ పరోక్షంగా సెటైర్ విసిరారు. ఈ సీన్ చూస్తుంటే 2023 వరల్డ్ కప్ సీన్ గుర్తుకొస్తుంది. కమ్మిన్స్ అప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను ఇప్పుడు ధోనీ కోసం వచ్చిన చెన్నై ఫ్యాన్స్ ను సైలెంట్ గా ఉంచాడంటూ హైదరాబాద్ ఫ్యాన్స్  తెగ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 11 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.