V6 News

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీ చైతన్య కాలేజీలో చోరీ.. దొంగ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీ చైతన్య కాలేజీలో చోరీ.. దొంగ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీ చైతన్య కాలేజీలో చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ గౌష్ ఆలం మీడియాకు వివరాలు వెల్లడించారు. దుర్షేడు గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(32) పాత నేరస్తుడు. మంకమ్మతోటలోని  శ్రీ చైతన్య కాలేజీలో ఆదివారం రూ.5లక్షల నగదు,10 గ్రాముల చైన్ దొంగిలించాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యుగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీని ఒప్పుకోవడంతోపాటు దాచిన నగదు రూ.5 లక్షలు, 10 గ్రాముల చైన్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో యుగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారలేదు. సమావేశంలో ఏసీపీ వెంకట స్వామి, టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.