
హైదరాబాద్: ఐజీసీఎస్ఈ పరీక్షల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య ఫ్యూచర్ పాత్ వేస్ గ్లోబల్ స్కూల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 3 నుంచి 8వ తరగతి వరకు 24 మంది విద్యార్థులు 10వ తరగతి ఐజీఈఎస్ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారని శ్రీచైతన్య ఫ్యూచర్ పాత్ వేస్ డైరెక్టర్ సీమా బొప్పన, చీఫ్ ఆఫ్ అకాడమిక్స్ పుష్పవల్లి, ఏజీఎం శివరామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
గచ్చిబౌలికి చెందిన 8వ తరగతి స్టూడెంట్ లక్ష్మి అనిక నృసింహదేవర ఐజీసీఎస్ఈ కెమిస్ట్రీలో 93 శాతం మార్కులు సాధించిందని వారు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పేరెంట్స్ కు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.