
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్ నడుస్తోందని ఏఐఎస్ఎఫ్ లీడర్ల ఫిర్యాదుతో ఎంఈవో చంద్రకళ సోమవారం స్కూల్ను సీజ్ చేశారు. ఏఐఎ స్ఎఫ్ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్ మాట్లాడుతూ శ్రీచైతన్య స్కూల్ మేనేజ్ మెంట్ రాజకీయ, డబ్బు బలంతో రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచ్లు ఓపెన్ చేసి పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తోందని ఆరోపించారు. పిల్లలను స్కూళ్లలో చేర్చేముందు అనుమతులు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలన్నారు.