
కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని .. శ్రీకృష్ణాష్టమి... జన్మాష్టమి... గోకులాష్టమి అంటారు. ఈ రోజు ( ఆగస్టు 16) విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆ రోజు కన్నయ్య భక్తులు చేసే హడివిడి అంతాకాదు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకృష్ణుడి పూజలో తులసి దళాలలకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అంతేకాదు తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా కొలుస్తారు. అందుకే జన్మాష్టమి రోజున( ఆగస్టు 16) .. సాక్షాత్తు శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపుడే కాబట్టి.. కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసి కృష్ణ పరమాత్ముడిని.. లక్ష్మీదేవిని ఆరాధిస్తే వారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణాష్టమి రోజు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆతరువాత తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తూ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. అనే మంత్రాన్ని పఠించాలి. అలాంటి వారి ఇంట్లో ఎల్లవేళలా సంపద.. ఐశ్వర్యం ఉండేలా .. కృష్ణపరమాత్ముడు ఆశీర్విస్తాడని పండితులు చెబుతున్నారు.
కృష్ణాష్టమి రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే అంతా శుభమే జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మొక్కను పసుపు.. కుంకుమ లతో అలంకరించి.. దీపారాధన చేసి కృష్ణాష్టమి రోజున పూజించి ఇంటి ఈశాన్య దిక్కులో నాటాలి. ఈ మొక్కకు ప్రతిరోజు సరిపడ నీళ్లను పోయాలి. ఇలా చేయడం వలన శత్రుబాధలు తొలగిపోవడమే కాకుండా..జీవితం ఆనందంగా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్కను ఇంటికి తీసుకురండి: ఇంట్లో తులసి మొక్క లేకపోతే, జన్మాష్టమి రోజున కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో లేదా ఈశాన్య దిశలో నాటండి. దీన్ని క్రమం తప్పకుండా పూజించడం వలన లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది.
శ్రీ కృష్ణాష్టమి రోజున భగవానుడిని పూజించే సమయంలో స్వామికి తులసి మాలను సమర్పించాలి. తరువాత కన్నయ్యను తులసిదళాలతో పూజించాలి. తులసి మొక్క దగ్గర శంఖం ఉంచి పూజలు చేయాలి. ఇలా పూజలు చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి.. సానుకూలత... ప్రశాంత ఏర్పడుతుంది.
స్వామి పూజ ముగిసిన తరువాత స్వామికి నైవేద్యం సమర్పించాలి. స్వీట్లు... పాలు.. వెన్న తో పాటు తులసి దళాలను కూడా సమర్పించాలి. తులసి ఆకులను స్వామికి నివేదన చేస్తే త్వరగా స్వీకరించి భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.