శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై భారత్ జోక్యం చేసుకోవాలి

 శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై భారత్ జోక్యం చేసుకోవాలి

శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు మంగళవారం  సాయంత్రం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చామని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాని అన్నాడీఎంకేకు చెందిన ఎం తంబిదురై, డీఎంకే నేత టీఆర్ బాలు అన్నారు. వివిధ మార్గాల ద్వారా శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ద్వీప దేశం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న తరుణంలో ఆ దేశానికి భారతదేశం ఆర్థిక సహాయాన్ని అందించింది. శ్రీలంక  ఇండియాకు అత్యంత సన్నిహిత పొరుగు దేశం. రెండు దేశాలు బలమైన బంధాలను పంచుకుంటున్నాయి. శ్రీలంకలో 22 మిలియన్ల మంది ప్రజలు ఆహారం, మందులు, ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని తమిళనాడుకు చెందిన నేతలు కేంద్రాన్ని కోరారు.