రణరంగమైన కొలంబో.. 30 మందికి పైగా గాయాలు

రణరంగమైన కొలంబో.. 30 మందికి పైగా గాయాలు
  • బారికేడ్లు దాటి, గోడలు దూకి ప్రెసిడెన్షియల్ 
  • ప్యాలెస్​లోకి వేలాది మంది నిరసనకారులు
  • అజ్ఞాతంలోకి ప్రెసిడెంట్ గోటబయ.. 13న రాజీనామా!
  • బయట గుమిగూడిన లక్షలాది మంది.. 
  • గోటబయ రాజీనామా చేయాలని నినాదాలు
  • ఘర్షణల్లో 30 మందికి పైగా గాయాలు
  • ప్రధాని విక్రమసింఘే రాజీనామా.. ఆయన ఇంటికి నిప్పు

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో రణరంగమైంది. తీవ్ర సంక్షోభానికి కారణమైన గోటబయ రాజపక్స.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రెసిడెంట్ ప్యాలెస్‌‌ను ముట్టడించారు. వేలాది మంది బిల్డింగ్‌‌లోకి చొచ్చుకెళ్లారు. నిరసనకారుల మార్చ్ గురించి ముందే తెలుసుకున్న గోటబయ.. శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారనేది తెలియరాలేదు. కొలంబో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ నుంచి ఓ విమానం వెళ్లిందని, పోర్టు నుంచి రెండు నేవీ షిప్‌‌లు వెళ్లాయని కథనాలు వస్తున్నా.. వాటిలో ఆయన వెళ్లారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తాను రాజీనామాకు సిద్ధమేని ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. 13న గోటబయ రాజీనామా చేస్తారని పార్లమెంట్​ స్పీకర్​ అబేయవర్దెన చెప్పారు.

సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొలంబోలో అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ఏరియాలో బారికేడ్లను దాటుకుని వేలాది మంది చొచ్చుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాలెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఛాథమ్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోటస్ రోడ్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కానీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రెసిడెంట్ ఆఫీస్, అధికారిక నివాసాన్ని ముట్టడించారు. వందలాది మంది ప్యాలెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోడలు ఎక్కి వెళ్లి ప్రెసిడెంట్ నివాసాన్ని స్వాధీనం చేసుకున్న నిరసనకారులు.. ప్యాలెస్ లోపలి గదులు, కారిడార్లలో చాలా మంది కలియతిరిగారు. కొందరు బెడ్లపై పడుకుని సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. మరికొందరు స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈత కొట్టారు. ఇక రోడ్డుపై కొన్ని కిలోమీటర్ల మేర నిరసనకారులే పోగయ్యారు. హెల్మెట్లు పెట్టుకుని.. శ్రీలంక జెండాలు చేతబట్టుకుని గోటబయ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

పలు చోట్ల గొడవలు
కొలంబోకు ట్రైన్లను నడపాలంటూ గాలే, కాండీ, మతారా ఏరియాల్లో రైల్వే అధికారులతో, ప్రొటెస్టర్లు గొడవలకు దిగారు. కొలంబోతోపాటు పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు, సెక్యూరిటీ సిబ్బందికి జరిగిన గొడవల్లో ఇద్దరు పోలీసులు సహా 30 మందికి పైగా గాయపడ్డారు. వీరు నేషనల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్నారు.

అజ్ఞాతంలోకి గోటబయ
శనివారం నిరసనలు జరుగుతాయని ముందే ఊహించిన గోటబయ.. శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన అధికారిక నివాసాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది తెలియరాలేదు. అయితే కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక వీఐపీ కాన్వాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తున్న వీడియో బయటికి వచ్చింది. అక్కడ అప్పటికే శ్రీలంక ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పార్క్ చేసి పెట్టారు. మరోవైపు కొలంబో పోర్టు నుంచి గజబాహు, సిదురాల నేవీ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లగేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొందరు వెళ్లారని హార్బర్ మాస్టర్ చెప్పినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే ఎవరు వెళ్లారనేది చెప్పేందుకు ఆయన నిరాకరించారని తెలిపింది.

కర్ఫ్యూ ఎత్తివేత
నిరసనలపై సమాచారం అందడంతో నెగోంబో, కెలాన్వియా, నెగెగోడా, మౌంట్ లవీనియా, కొలంబో నార్త్, కొలంబో సౌత్, కొలంబో సెంట్రల్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు కర్ఫ్యూ విధించారు. తర్వాతి ఉత్తర్వులు వచ్చే దాకా అంక్షలు కొనసాగుతాయన్నారు. అయితే లాయర్ల అసోసియేషన్లు, మానవ హక్కుల సంస్థలు, రాజకీయా పార్టీల ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ ఎత్తివేశారు. కొలంబో శివారు ఏరియాల నుంచి ప్రజలు కాలినడకన ఫోర్ట్ ఏరియాకు చేరుకుంటున్నారని ‘దేశమంతా కొలంబో వైపు’ ఉద్యమ నిర్వాహకులు తెలిపారు. గోటబయ దిగిపోయే దాకా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
 

శ్రీలంక ప్రధాని ఇంటికి నిప్పు
ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. తాను ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని విక్రమసింఘే ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరిగింది. కొలంబోలోని ఆయన వ్యక్తిగత నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ప్రొటెస్టర్లను అడ్డుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత సెక్యూరిటీని దాటుకుని లోనికి వెళ్లిన నిరసనకారులు.. ప్రధానికి సంబంధించిన వాహనాలను కూడా అంటించినట్లు సమాచారం.

రాజీనామాకు రెడీ: విక్రమసింఘే
అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటు కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ‘‘అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పార్లమెంటులో మెజారిటీ నిరూపించు కున్నాక.. ప్రధాని రాజీనామా చేస్తారు. అప్పటిదాకా పదవిలో కొనసాగు తారు” అని పీఎం మీడియా డివిజన్ వెల్లడించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పార్లమెంటును సమావేశపరచాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాని రణిల్ విక్రమసింఘే కోరారు. అన్ని పొలిటికల్ పార్టీలతో ఎమర్జెన్సీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శనివారం పిలుపునిచ్చారు. మరోవైపు సొంత పార్టీలోని కొందరు ఎంపీల బృందం గోటబయకు లేఖ రాశారు. పదవిలో నుంచి దిగిపోవాలని అందులో కోరారు.

13న గోటబయ రాజీనామా!
ప్రెసిడెంట్ పదవికి గోటబయ రాజపక్స బుధవారం (13న) రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహింద యప అబెయవర్దెన శనివారం రాత్రి వెల్లడించారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత గోటబయకు లేఖ రాసిన అబెయవర్దెన.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కోరారు. దీంతో ఆయనకు గోటబయ ఈ మేరకు సమాచారమిచ్చారు. గోటబయ రాజీనామా చేస్తే కొత్త ప్రెసిడెంట్ నియమితులయ్యే దాకా తాత్కాలిక అధ్యక్షుడిగా అబెయవర్దెన కొనసాగనున్నారు.