శ్రీలంక అధ్యక్షభవనంలో విధులు ప్రారంభం

శ్రీలంక అధ్యక్షభవనంలో విధులు ప్రారంభం

శ్రీలంక అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మళ్లీ విధులు ప్రారంభమయ్యాయి. జులై నెల ప్రారంభంలో అధ్యక్ష సెక్రటేరియట్ లోపలికి ఆందోళనకారులు చొచ్చుకుని వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు సెక్రటేరియట్ లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. సెక్రటేరియట్ లోని పలు చోట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా గట్టి భద్రత మధ్య కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తన విధులు ప్రారంభించారు. గత అధ్యక్షుడు  గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాలంటూ గత మూడ్నెళ్లుగా లంకవాసులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 9న తీవ్ర విధ్వంసానికి దిగారు.

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను యుద్ధనేరాల కింద అరెస్టు చేయాలని.... దక్షిణాఫిక్రకు చెందిన మానవహక్కుల బృందం క్రిమినల్ కేసు నమోదు చేసింది. LTTEకి వ్యతిరేకంగా శ్రీలంకలో దశాబ్దాల తరబడి సాగిన పౌర యుద్ధంలో గొటబాయ పాత్రను ప్రశ్నించింది. శ్రీలంక ప్రజలు ఆయన్ను యుద్ధవీరుడు అని పొగిడినా... 2009లో LTTE అధినేత ప్రభాకరన్ మృతితో యుద్ధం ముగించిన తీరు సరికాదన్నారు. మాన హక్కులను ఉల్లంఘించిన గోటబాయ నిందితుడు అన్నారు. ఈ మేరకు సౌతాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ డ్ జస్టిస్ ప్రాజెక్టు లాయర్లు సింగపూర్ అటార్నీ జనరల్ కు క్రిమినల్ ఫిర్యాదు సమర్పించారు. గొటబాయను తక్షణం అరెస్టు చేయాలన్నారు.