శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. పలు ఆసక్తికర పరిణామాల తర్వాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు. ఆ విషయాన్ని శ్రీలంక స్పీకర్ మహింద యాప అభయవర్దెన అధికారింగా ప్రకటించారు. వారంలోగా కొత్త ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. అప్పటివరకూ రణిల్ విక్రమసింఘేనే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఎదుట విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేశారు.
Ranil Wickremesinghe sworn in as interim President of Sri Lanka
— ANI Digital (@ani_digital) July 15, 2022
Read @ANI Story | https://t.co/DTSbjiTLIe#RanilWickremesinghe #SrilankaPresident #SRILanka pic.twitter.com/nDN4tnpfkw
దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల క్రితం ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా సమర్పించకుండానే మాల్దీవులకు పారిపోయినట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత సింగపూర్ కు పయనమైనట్టు సమాచారం. అయితే గొటబాయకు తాము ఆశ్రయం ఇవ్వలేదని, వ్యక్తిగతం గానే ఆయనకు ఇక్కడికి వచ్చినట్లుగా సింగపూర్ ప్రభుత్వం సైతం తెలిపింది. కాగా తాజాగా గొటబాయ తన రాజీనామాపై ప్రకటనను స్పీకర్ తో చెప్పడంతో.. తాత్కాలిక అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘేను నియమిస్తున్నట్టు ప్రకటించారు.
