కొలంబో: అమెరికా యుద్ధ విమానాలను తమ దేశంలో దింపేందుకు అనుమతి కోరితే తిరస్కరించామని శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే వెల్లడించారు. శుక్రవారం ఆయన పార్లమెంటులో మాట్లాడారు. "మార్చి మొదటి వారంలో అమెరికా మమ్మల్ని సంప్రదించింది. 8 శక్తిమంతమైన యాంటీ-షిప్ మిసైల్స్‌తో కూడిన రెండు యుద్ధ విమానాలను శ్రీలంకలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసేందుకు అమెరికా పర్మిషన్ కోరింది. అయితే, ఇందుకు లంక ప్రభుత్వం ‘నో’ చెప్పింది. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటీ మేం ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగానే ఉంటాం. మా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటాం" అని దిసనాయకే తేల్చి చెప్పారు.
