శ్రీలంక టెస్టు జట్టు మొదటి కెప్టెన్ మృతి

V6 Velugu Posted on Oct 18, 2021

శ్రీలంక క్రికెట్ టీం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీలంక టెస్ట్ జట్టుకు మొదటి కెప్టెన్ గా వ్యవహరించిన బందుల వర్ణపురా చనిపోయారు. 68 ఏళ్ల  వర్ణ పుర ఇవాళ (సోమవారం) అనారోగ్యంతో మృతి చెందారు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం కారణంగా మరణించినట్లు చెందినట్లు శ్రీలంక మీడియా తెలిపింది.

1982 సంవత్సరం ఫిబ్రవరి లో కొలంబో వేదికగా ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వర్ణపూర… శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాట్స్మెన్ గా, తొలి పరుగులు చేసిన ఆటగాడిగా…అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్ తో పాటు ఓపెనింగ్ బౌలింగ్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా పలు రికార్డులను తన  సొంతం చేసుకున్నారు.

తన క్రికెట్ కిరణ్ మొత్తం లో నాలుగు టెస్టులు,12 వన్డేలు ఆడిన బందుల వర్ణ పుర… 1975 సంవత్సరం లో జరిగిన ప్రపంచకప్ ద్వారా వన్డేలో ఎంట్రీ ఇచ్చారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా బందుల  శ్రీలంక కోచ్ గా పనిచేశారు. కాగా బందుల వర్ణపుర మృతి పట్ల శ్రీలంక టీం క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Tagged Sri Lanka, dies, First Test Captain, Bandula Warnapura

Latest Videos

Subscribe Now

More News