- రూ.26 లక్షల విలువైన విగ్రహాలు, ఆభరణాలు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: కూకట్పల్లి సర్దార్‌పటేల్ నగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును కేపీహెచ్‌బీ పోలీసులు ఛేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్‌చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నీలపు నీలయ్య అలియాస్ అనిల్15 చోరీ కేసుల్లో నిందితుడు. గత నవంబర్‌లో జైలు నుంచి విడుదలై మహరాజు మల్లికార్జున్, భాస్య వెంకట్, మోహిత్‌కుమార్, దున్నపోతుల పవన్కల్యాణ్అలియాస్ కల్యాణ్, దండి అనిల్తేజ, కంబపు విజయ్, తంగిల్ల మణికంఠ దుర్గాప్రసాద్అలియాస్అఖిల్తో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు.
సర్దార్‌పటేల్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి బంగారు, వెండి ఆభరణాలతోపాటు విగ్రహాలను సూట్‌కేస్‌లో పెట్టుకొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి, ఐదుగురు నిందితులను అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నీలయ్య, వెంకట్, మోహిత్‌కుమార్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
