నారీ నారీ నడుమ మురారి’లో శ్రీవిష్ణు సర్‌‌‌‌ ప్రైజ్

నారీ నారీ నడుమ మురారి’లో శ్రీవిష్ణు సర్‌‌‌‌ ప్రైజ్
  • హీరోగా వరుస చిత్రాలు చేస్తున్న  

శ్రీవిష్ణు.. సంక్రాంతికి రాబోయే ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో గెస్ట్ రోల్‌‌లో కనిపించనున్నాడు.   శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న చిత్రంలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో  మెరవనున్నాడని  ఒక స్పెషల్ వీడియోతో ఆదివారం రివీల్ చేశారు. ఇందులో  శ్రీవిష్ణు ఒక ల‌‌గ్జరీ కార్‌‌‌‌లో నుంచి కిందికి దిగుతూ  స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేశాడు. 

 రామ్ అబ్బరాజు డైరెక్షన్‌‌లో  గ‌‌తంలో వ‌‌చ్చిన ‘సామ‌‌జ‌‌వ‌‌ర‌‌గ‌‌మ‌‌న’ మంచి హిట్ అవ‌‌డంతో పాటు, వీరి కాంబోలో మరో మూవీ కూడా ఉండటంతో ఇందులో స్పెషల్ క్యారెక్టర్ అడగ్గానే శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.  శ్రీవిష్ణు, శర్వానంద్‌‌లకు మంచి  కామెడీ టైమింగ్‌‌ ఉండటంతో  వీరిద్దరి మధ్య  వచ్చే సీన్స్‌‌పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. 

 సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రాన్ని  ఏకేఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై   అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.  సంక్రాంతి సందర్భంగా జనవరి 14 సాయంత్రం 5.49 నుంచి ప్రీమియర్స్‌‌తో ఈ సినిమా విడుదల కానుంది.