- కేటీఆర్ 'సర్కస్' కామెంట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ అమెండ్మెంట్బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో కేటీఆర్, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణా రావును స్పీకర్ కోరారు. అయితే, ఆ సమయంలో మంత్రి సభలో లేకపోవడంతో కేటీఆర్.. ఇది సర్కార్ కాదని, సర్కస్నడుపుతున్నారని విమర్శించారు. బిల్లు వివరాలేంటో చెప్పాలని డిమాండ్చే శారు.
మంత్రి సిద్ధంగా లేరా అంటూ ఓ వైపు స్పీకర్ మాట్లాడుతుండగానే ఆయన కామెంట్చేస్తుండడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. సభను కొంచెం హద్దులో పెట్టాలని స్పీకర్‌ను ఆయన కోరారు. స్పీకర్ పనులనూ వాళ్లే డిసైడ్చేస్తున్నారని మండిపడ్డారు.
