ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శ్రీదివ్య.. అబ్బాయి ఎవరో తెలుసా?

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శ్రీదివ్య.. అబ్బాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తెలుగమ్మాయి శ్రీదివ్య(Sridivya)..  మారుతి(Maruthi) దర్శకత్వం వహించిన బస్టాప్(Bus stop) సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ తరువాత ఆమెకు ఆఫర్స్ ఎక్కువగా రాలేదు. ఆ తరువాత కేరింత(Kerintha) అనే సినిమాలో మాత్రమే నటించింది. 

ఆ తరువాత తమిళ సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడంతో అక్కడే సెటిలైపోయింది. శివకార్తికేయన్‌ హీరోగా వచ్చిన వరుత్తపడాద వాలిబర్‌ సంఘం మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.. కాక్కీ సట్టై, జీవా, ఈటీ, మరుదు, బెంగుళూర్‌ నాట్కల్‌, పెన్సిల్‌ వంటి పలు సూపర్ హిట్ సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె నటించిన రైడ్‌ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న శ్రీదివ్య ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది కూడా ప్రేమ వివాహమే, నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీదివ్య ప్రేమిస్తున్న ఆ అబ్బాయి ఎవరా? అంటూ సెర్చింగ్ మొదలుపెట్టేశారు నెటిజన్స్.