మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌

మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌.. మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 23–21, 21–17తో వరల్డ్ మూడో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌హట్‌‌‌‌‌‌‌‌ ఎనుగుయెన్‌‌‌‌‌‌‌‌ (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గాడు. 59 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఎదురైనా కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలు ఆడి గట్టెక్కాడు. 

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 9–21, 18–21తో యుషి తనకా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, సతీశ్ కరుణాకరన్‌‌‌‌‌‌‌‌ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ఆయుష్‌‌‌‌‌‌‌‌ షెట్టి 13–21, 17–21తో టోమా జూనియర్‌‌‌‌‌‌‌‌ పపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల–తానీషా క్రాస్టో 21–17, 18–21, 21–15తో జూలియన్‌‌‌‌‌‌‌‌ మైయో–లీ పలెర్మో (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రేరణ అల్వేకర్‌‌‌‌‌‌‌‌–మురుణ్మయి దేశ్‌‌‌‌‌‌‌‌పాండే 9–21, 14–21తో సు యిన్‌‌‌‌‌‌‌‌ హుయ్‌‌‌‌‌‌‌‌–లిన్‌‌‌‌‌‌‌‌ జిహ్‌‌‌‌‌‌‌‌ యున్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో ఓడారు.