మోడర్న్ డ్రెస్‌లో లేడీ జేమ్స్ బాండ్‌లా అదిరిపోయిన శ్రీలీల లుక్

మోడర్న్ డ్రెస్‌లో లేడీ జేమ్స్ బాండ్‌లా అదిరిపోయిన శ్రీలీల లుక్

స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల. తెలుగు, తమిళ, కన్నడలో బ్యాక్ టు బ్యాక్  ప్రాజెక్టులు చేస్తూనే బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతోంది. మంగళవారం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఏజెంట్ మిర్చి’ అనే పాత్రలో కనిపించనున్నట్టు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది శ్రీలీల. ఇందులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మోడర్న్ డ్రెస్‌లో లేడీ జేమ్స్ బాండ్‌లా  స్టైలిష్‌గా కనిపించిందామె. బ్యాక్‌గ్రౌండ్‌లో హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు ఉండటం ఆసక్తిని పెంచుతోంది. ‘రెడీ, స్టడీ, ఫైర్’ అంటూ ఈ పోస్టర్‌‌కు క్యాప్షన్ ఇవ్వడం క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక దీపావళి కానుకగా  అక్టోబర్ 19న ఫైరింగ్ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అలాగే ఇందులో లీడ్ రోల్‌ చేస్తున్న బాబీడియోల్‌ లుక్‌ను కూడా రివీల్ చేశారు.  కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతోన్న  ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ నెలాఖరుకు రవితేజతో నటించిన  ‘మాస్ జాతర’ చిత్రం ద్వారా శ్రీలీల తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ మూవీ చేస్తోంది. ఇక తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా ‘పరాశక్తి’లో నటిస్తోంది. అలాగే కార్తీక్ ఆర్యన్‌కు జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తోంది. ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌‌టైనర్‌.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏజెంట్‌ క్యారెక్టర్‌‌లో యాక్షన్‌ సీన్స్‌లో సరికొత్తగా కనిపించబోతోంది.