టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకీ అట్లూరి తెలుగులో లక్కీ భాస్కర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్రంలో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రహం షూటింగ్ పనులు పూర్తీ చేసుకుంది. దీంతో లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు.
ఈ క్రమంలో ఇటీవలే లక్కీ భాస్కర్ చిత్రంలోని " శ్రీమతిగారూ" ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీమని రచించగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా ప్రముఖ సింగర్స్ విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ పాడారు.
ALSO READ | దేవర బిగ్ హిట్: వాళ్లందరికీ థాంక్స్ చెప్పిన తారక్..
కోపాలు చాలండి శ్రీమతి గారు... కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు అంటూ స్టార్ట్ అయ్యే లిరిక్స్, అలాగే భార్యభర్తల అనుబంధం, పెళ్లి, ప్రేమ ఇలా అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో లక్కీ భాస్కర్ చిత్రం ట్రైలర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో డైరెక్ట్ హిట్ ని అందించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా లక్కీ భాస్కర్ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం తెలుగుతోపాటూ తమిళం, మలయాళం, హిందీ తదితర భాషలలో దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల రిలీజ్ కానుంది.