అసిస్టెంట్ డైరెక్టర్ని కొట్టిన సీరియల్ హీరో

అసిస్టెంట్ డైరెక్టర్ని కొట్టిన సీరియల్ హీరో

శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ హీరో చందన్ ని తెలుగు టెలివిజన్ అసోసియేషన్ బ్యాన్ చేసింది. షూటింగ్ టైంలో రభస చేయడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ని బూతులు తిడుతూ కొట్టాడని తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బెంగళూరులో ప్రెస్మీట్ పెట్టి తెలుగు టెలివిజన్ ని కించపరిచారన్నారు. కన్నడ ఆర్టిస్టులను చిన్నచూపు చూస్తున్నారన్న చందన్ వ్యాఖ్యలను వారు ఖండించారు. 

ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ కి జరిగిన గొడవని ప్రెస్ మీట్ పెట్టి ప్రాంతీయ విభేధంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రెండు ప్రాంతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని..తెలుగు టీవీ పరిశ్రమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దని.. భాషాపరమైన గొడవలు వద్దంటూ హితవు పలికారు. రెండు అసోసియేషన్ లు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు. తెలుగు టీవీ పరిశ్రమ అన్ని భాషల వారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తొందన్నారు. ప్రాంతీయ బేధాలు తెలుగు వారికీ లేవని..టాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తామని స్పష్టం  చేశారు. 

‘‘ఎన్నో కలలతో ఈ ఇండస్ట్రీకి వచ్చా. షాట్ రెడీ అని 5 టైమ్స్  పిలిచినా చందన్ రాలేదు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తిట్టడంతోపాటు కొట్టాడు’’ అని శ్రీమతి శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ రంజిత్ తెలిపారు.