శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్ర : డిపో దగ్గరకు నో పర్మిషన్

శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్ర : డిపో దగ్గరకు నో పర్మిషన్

ఖమ్మం: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అంతిమయాత్ర ఖమ్మంలో మొదలైంది. ఇంటిదగ్గర బౌతికఖాయానికి కార్మికులు, జేఏసీ, పార్టీల నేతలు నివాళులర్పించారు. మృతదేహం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకోగానే రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యులు, అప్పటికే అక్కడకు చేరుకున్న వందలాదిమంది కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు.  బీజేపీ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కార్మికనేత అశ్వత్ధామరెడ్డి నివాళులర్పించారు.

అంతకుముందు సరిహద్దు గ్రామం నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీగా వెళ్లారు కార్మికులు. దారిపోడవునా శ్రీనివాసరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుతోనే శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కార్మికులు ఆరోపించారు. బౌతికఖాయన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు తమతో పనిచేసిన తోటి కార్మికుడు ఇక లేడంటూ బాధ పడుతున్నారు.

శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించిన టైంలో అతన్ని కాపాడేందుకు కొడుకు ప్రయత్నించాడు. అప్పుడు అతని రెండు చేతులకు గాయాలయ్యాయి. ఇవాళ రెండు చేతులకు కట్లు కట్టుకుని తండ్రి మృతదేహం దగ్గర కన్నీరు మున్నీరవడం అక్కడున్న వారిని కలచివేసింది. అంతిమయాత్రను బస్ డిపో మీదుగా తీసుకెళ్లడానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని నేతలు మండిపడుతున్నారు.