ప్రతి భర్తను ఆలోచింపజేసేలా మిస్టర్ ప్రెగ్నెంట్

ప్రతి భర్తను ఆలోచింపజేసేలా మిస్టర్ ప్రెగ్నెంట్

‘బిగ్‌‌‌‌బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ కథలో మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. అయితే మేల్ ప్రెగ్నెన్సీ నేపథ్యం కాబట్టి ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఇది కత్తి మీద సాము లాంటి సినిమా అని చెప్పారు. 

అయినా స్ర్కిప్ట్‌‌‌‌ ను ఛాలెంజింగ్‌‌‌‌గా తీసుకున్నాం. అవుట్ పుట్ బాగా వచ్చింది. మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్లు సినిమా చూసి, నచ్చడంతో  రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు  వేరే హీరోల్ని అనుకున్నాం. అయితే ‘బిగ్‌‌‌‌బాస్’ గేమ్స్‌‌‌‌ లో సోహైల్ ఎమోషన్‌‌‌‌ చూశాక.. ఈ కథకు తను బాగుంటాడని అనిపించింది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను అతను చాలా  సహజంగా చేశాడు. ప్రతి భర్తను ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. ఇలాంటి కథతో తెలుగులో మూవీ రాలేదు. ఇంగ్లీష్‌‌‌‌లో వచ్చినా.. అది ఎక్స్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌మెంటల్‌‌‌‌గా చేశారు. మేము ఈ సినిమా ప్రారంభించిన తర్వాత బాలీవుడ్‌‌‌‌లో ఈ టైప్ సినిమా ఒకటి వచ్చింది. అయినా ఇది  యూనిక్‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పారు.