ప్రాజెక్టులోకి 15046 క్యూసెక్కుల వరద నీరు

ప్రాజెక్టులోకి 15046 క్యూసెక్కుల వరద నీరు

రాష్ట్రంలోకి నైరుతి రుతపవనాల రాకతో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులోకి 15046 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసీలు ఉండగా... వరద ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం 1067.6 అడుగులు 24.616 టిఎంసీలు నీరు చేరింది.