సీతమ్మను రామయ్య పెళ్లాడింది ఇక్కడే..

సీతమ్మను రామయ్య పెళ్లాడింది ఇక్కడే..

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఆదివారం శ్రీసీతారామయ్య కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. అయితే అసలు నిజంగా సీతను రామయ్య వివాహమాడిన స్థలం తెలుసుకుందాం..

మిథిల.. ఈ పేరు విన్నాం కానీ.. ఇక్కడే సీతమ్మ తల్లి జన్మించిందని ఎంతమందికి తెలుసు..విదేహి రాజ్యం అని పిలిచే ఈ రాజ్యంలోనే భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఓ బంగారుపెట్టెలో కనిపించింది. విదేహి రాజ్యంలో పుట్టింది గనుకే ఆమెకి వైదేహి అని పేరు ఉంది. ఈ రాజ్యంలో సీతమ్మ పెరిగి పెద్దదైంది. అంతేకాదు, రాముడిని పెళ్లి చేసుకుంది నగరంలోనేనని చెబుతారు.

సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మరిచిపోయారు.. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకుంటున్నారు. ఈ చిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఓ భారీ ఆలయాన్ని నిర్మించారు.

వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో.. పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించారు. ఈ నిర్మాణానికి 9 లక్షల ఖర్చు అయింది. అందుకనే.. ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది.