
- బోధన్ సెగ్మెంట్ పరిధిలోని 6 గ్రామాల చుట్టూ చేరిన వరద
- ఎస్డీఆర్ఎఫ్ బోట్లలో గర్భిణులు, పిల్లల తరలింపు
- వాన పడితే.. తలెత్తే పరిస్థితులపై ఆఫీసర్ల ఆందోళన
నిజామాబాద్, వెలుగు: ఎగువ నుంచి భారీగా ఎస్సారెస్పీకి వరద వస్తుండగా పలు గ్రామాలపై బ్యాక్వాటర్ఎఫెక్ట్పడింది. నిజామాబాద్జిల్లా బోధన్సెగ్మెంట్పరిధిలోని ఆరు గ్రామాల్లోకి గోదావరి వరద నీరు చేరి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్టీమ్ మూడు బోట్లలో 1,400 మంది బాధితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించింది.
పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చేందుకు శ్రీరాంసాగర్ నుంచి ప్రాజెక్టు నుంచి 5.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒకవేళ వాన పడి.. నదిలో నీటి మట్టం మరింత పెరిగితే.. ఎలా నియంత్రించాలనేదానిపై అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది.
అర్ధరాత్రి చుట్టుముట్టిన నీరు..
గోదావరి నదిలో మంజీరా, హరిద్రా ఉపనదుల వరద కలిశాక ఎస్సారెస్పీకి వెళ్లే నీరంతా వెనక్కు మళ్లుతుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురవడమే కాకుండా బోధన్ సెగ్మెంట్పరిధిలోని పలు గ్రామాల చుట్టూ బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది.
నదిలో నీటి ఉధృతి తగ్గుతుంటేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. గురువారం బోధన్మండలం హంగర్గాలోని 205 ఇండ్లలోని 1,165 మందిని రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నించారు.
అయితే.. తమకు ఇబ్బందిలేదని గ్రామస్తులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. కాగా.. ఒక్కసారిగా అర్ధరాత్రి హంగర్గా చుట్టూ బ్యాక్ వాటర్వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్ బోట్లలో 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గ్రామంలోని రెండు అంతస్తుల ఇండ్లలోని వారు మాత్రమే ఉండిపోయారు. సాలూరా మండలం హున్సా, ఖాజాపూర్, మందర్నా గ్రామాల చుట్టూ కూడా బ్యాక్‌వాటర్ చేరడంతో ఎస్డీఆర్ఎఫ్బోట్లతో పాటు 28 ట్రాక్టర్లలో 780 మందిని తరలించారు.
గర్భిణులు, పిల్లలకు ముందుగా ప్రయారిటీ ఇచ్చారు. ఇంకా మూడు గ్రామాల్లో ఐదు వేల మందిదాకా ఉండిపోయారు. ఖండ్గావ్, బిక్నెల్లి గ్రామాలకు చేరువగా బ్యాక్వాటర్వస్తోంది. మరోవైపు ఆఫీసర్లు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
బ్యాక్ వాటర్ గ్రామాలను కలెక్టర్వినయ్కృష్ణారెడ్డి సందర్శించారు. నవీపేట మండలం మిట్టాపూర్, అల్జాపూర్గ్రామాల చుట్టూ గోదావరి బ్యాక్‌వాటర్ చేరడంతో 900 మంది చిక్కిపోయారు. ఆవులు, బర్ల పెంపకందార్లు సమీప గ్రామాల్లోని బంధువులు, ఫ్రెండ్స్ ఇండ వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. ఆ రెండు గ్రామాల్లో పలువురు చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. ఇంకోవైపు ఆరు గ్రామాల్లో కరెంట్సరఫరా లేకపోవడంతో పునరుద్ధరించేందుకు ఎన్పీడీసీఎల్అధికారులు శ్రమిస్తున్నారు.