ఎస్సారెస్పీకి 4.90 లక్షల క్యూసెక్కుల వరద ..39 గేట్లు ఎత్తి 5.50 లక్షల క్యూసెక్కులకుపైగా నీటి విడుదల

ఎస్సారెస్పీకి 4.90 లక్షల క్యూసెక్కుల వరద ..39 గేట్లు ఎత్తి 5.50 లక్షల క్యూసెక్కులకుపైగా  నీటి విడుదల

బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. శుక్రవారం 4.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 39 గేట్ల నుంచి 5.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరదను దిగువకు వదులుతున్నారు. భారీగా నీరు వెళ్తుండగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

 గోదావరి పరివాహక ప్రాంతంలోని సావెల్, తడపాకల్ ఆలయాలు నీటమునిగాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం1,091.00 అడుగులు ( 80.50టీఎంసీలు)కాగా,శుక్రవారం సాయం త్రం1,085.60 అడుగులు (61.88 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఆఫీసర్లు చెప్పారు. వరద కాల్వకు 17,300 క్యూసెక్కుల నుంచి 12 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.