సగం నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్

సగం నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్

బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సగం నిండింది. జూలై చివరి పది రోజుల్లో మహారాష్ట్ర ఎగువన కురిసిన వర్షాల వల్ల ఇన్ ఫ్లో పెరగడంతో ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకుంది. ఇప్పటివరకు 30.85 టీఎంసీల వరద నీరు వచ్చిందని ఇరిగేషన్ ఏఈ కొత్త రవి తెలిపారు. గత  ఏడాదితో పోల్చితే ఈసారి 3.30 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 2150 క్యూసెక్కుల వరద వస్తోందని ఆఫీసర్లు చెప్పారు. 

సాగు, తాగునీటికి కలిపి జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3.62 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు,80.50 టీఎంసీలు కాగా, సోమవారం సాయంత్రానికి 1078.20 అడుగులు,40.30 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 1079.50 అడుగులు,43.66 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.