ఆదర్శ రైతు భూమి కబ్జా..కంప్లైంట్ చేసినా పట్టించుకోని ఆఫీసర్లు

ఆదర్శ రైతు భూమి కబ్జా..కంప్లైంట్ చేసినా పట్టించుకోని ఆఫీసర్లు

నర్సాపూర్, వెలుగు : తన భూమిని కబ్జా చేశారని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఆదర్శ రైతు శ్రీశైలం ఆరోపించారు. నర్సాపూర్ పట్టణానికి కూతవేటు దూరంలో  వెంచర్ ను ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు తన భూమిని ఆక్రమించుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 731 లోని 12 గుంటల భూమిని కబ్జా చేశారని తెలిపారు. ఈ విషయంపై రెండు రోజుల క్రితం నర్సాపూర్  తహసీల్దార్, ఎస్సైకి కంప్లైంట్  చేయగా భూమి జోలికి వెళ్లవద్దని వెంచర్  యాజమాన్యాన్ని ఆదేశించారని

కానీ యాజమాన్యం శనివారం మళ్లీ తన భూమిని జేసీబీతో చదును చేసి రోడ్డు కోసం మట్టిని తరలించారని చెప్పారు.  ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్  వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.