
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. పండుగ వాతావరణం, సందర్శకుల కోలాహలం మధ్య ఈ గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్ లో తొలిసారి గేట్లు ఎత్తుతుండటంతో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. తర్వాత ఏపీ మంత్రి అనిల్ కుమార్ నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేతలు ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగుతూ మొబైల్స్ కి పనిచెప్పారు.