నాగ్‌పూర్: ఇండియా యంగ్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక భమిడిపాటి–వైదేహి చౌదరీ.. ఐటీఎఫ్ విమెన్స్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన విమెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి–వైదేహి 6–2, 6–1తో సౌజన్య భవిశెట్టి–మీ హసెగవా (జపాన్)పై నెగ్గారు. విమెన్స్ సింగిల్స్‌లో సౌజన్య భవిశెట్టి 2–6, 6–2, 2–6తో సోహా సాధిక్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో షేజల్ భటుడా 0–6, 0–6తో డాలిలా జాకుపోవిచ్ (స్లోవేనియా) చేతిలో పరాజయం చవిచూసింది.
