వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం
  •                 ఈనెల 10, 17వ తేదీల్లో టోకెన్లు జారీ: టీటీడీ

తిరుమలలో ఈ నెల  10, 17వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కోసం 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తామని అధికారులు చెప్పారు. ఐదేళ్లలోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ నెల  11, 18వ తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒకటిన్నరవరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తుల సౌకర్యం కోసం జూన్‌ నెల‌ కోటా కింద రూ.300- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ నెల 10వ తేదీన‌ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌, కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

తలనీలాల విక్రయం ద్వారా రూ.26.44 కోట్లు

త‌ల‌నీలాల విక్రయం ద్వారా రూ.26.44 కోట్ల ఆదాయం ల‌భించినట్లు టీటీడీ శనివారం వెల్లడించింది. ఈ=వేలంలో  33,800 కిలోల త‌ల‌నీలాలు అమ్ముడుపోయినట్లు తెలిపింది.