భారీతీయ సినీ చరిత్రను మలుపు తిప్పిన చిత్రం 'బహుబలి'ఫ్రాంఛైజ్. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. అద్భుతమైన కథాశం, భారీతనం , విజువల్స్ తో కోట్లాది మంది ప్రేక్షకులను హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి 2: ది కంక్లూజన్' చిత్రాలను కలిపి, అధునాతన సాంకేతిక హంగులతో, సరికొత్త ఎడిటింగ్‌తో ఒకే బృహత్తర చిత్రంగా మన ముందుకు తీసుకువస్తున్నారు.
లేటెస్ట్ గా దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానాతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వూలో పాల్గొన్నారు.'బాహుబలి: ది ఎపిక్' అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్అందించారు. 'బాహుబలి' ప్రపంచానికి సంబంధించిన ఒక భారీ 3D యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్రం పేరే 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'.
'బాహుబలి: ది ఎటర్నల్ వార్' టీజర్‌ను విడుదల చేయబోతున్నామని రాజమౌళి తెలిపారు. ఇది 'బాహుబలి 3' కాదు, కానీ ఇది బాహుబలి ప్రపంచానికి కొనసాగింపు వెల్లడించారు. ఇది అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించిన 3D యానిమేషన్ చిత్రం' అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఈ యానిమేషన్ చిత్రానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. బడ్జెట్ రూ 120 కోట్లు అని తెలిపారు. ఈ భారీ బడ్జెట్‌ను విన్న ప్రభాస్ నవ్వుతూ, రూ.120 కోట్లా? అది మా 'బాహుబలి' మొదటి భాగం కోసం అనుకున్న ప్లానింగ్ బడ్జెట్ అంటూ సరదా వ్యాఖ్యానించారు.
నిర్మాత శోభు యార్లగడ్డ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ గత రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి దశలో ఉందని రాజమౌళి వెల్లడించారు. ఈ అద్భుతమైన విజువల్స్ వెనుక హాలీవుడ్ స్థాయి యానిమేషన్ స్టూడియో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రఖ్యాత యానిమేషన్ సిరీస్ 'ఆర్కేన్' (Arcane) కోసం పనిచేసిన స్టూడియోనే ఈ 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'ను కూడా అభివృద్ధి చేస్తుందని రాజమౌళి తెలియజేశారు. ఈ మాట విని ప్రభాస్, రానాలు సైతం ఆ యానిమేషన్ చిత్రం యొక్క విజన్, స్థాయి, గొప్పదనం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ 'ది ఎటర్నల్ వార్' టీజర్‌ను 'బాహుబలి: ది ఎపిక్' సినిమా ఇంటర్వెల్ సమయంలో థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
