రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్

రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్

‘హాలీవుడ్‌‌లో సినిమా చేయాలని ఉంటే చెప్పండి.. మాట్లాడుకుందాం’ అంటూ హలీవుడ్ టాప్ డైరెక్టర్‌‌‌‌.. ఓ టాలీవుడ్‌‌ డైరెక్టర్‌‌‌‌కు ఆఫర్‌‌‌‌ ఇస్తాడని ఎవరైనా ఊహించగలరా? కానీ ఇటీవల లాస్ ఏంజిలిస్‌‌లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌‌ ఈవెంట్‌‌ తర్వాత ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్ చేసింది. తన సినిమాలతో ప్రపంచంలో కోట్లమంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కేమరూన్‌‌ను.. రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇంప్రెస్ చేసింది. అందుకే రెండోసారి భార్యతో కలిసి ఈ సినిమా చూశారు. ఆ తర్వాత రాజమౌళితో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా ‘మీరు తీసిన టెర్మినేటర్‌‌‌‌, టైటానిక్, అవతార్ లాంటి సినిమాలన్నీ చూశా, మీరే నాకు ఇన్‌‌స్పిరేషన్‌‌’ అని కేమరూన్‌‌తో చెప్పారు రాజమౌళి. కేమరూన్ మాట్లాడుతూ ‘మీ సినిమాలో పాత్రలు చూస్తుంటే.. ఎంతసేపైనా చూడాలనిపించే ఫీలింగ్ కలిగింది. అలాగే మీరు స్టోరీ చెప్పే విధానం బాగుంది. ఫైర్, వాటర్‌‌‌‌తో క్యారెక్టర్స్‌‌ను పరిచయం చేయడం ఇంటరెస్టింగ్‌‌. క్యారెక్టర్స్‌‌తో పాటు ట్విస్టులు, టర్న్‌‌లు, వాళ్ల ఫ్రెండ్‌‌ షిప్‌‌ లాంటివన్నీ బాగున్నాయి. సినిమా చాలా బాగా నచ్చింది’ అన్నారు. ‘మీ మాటలు వింటుంటే అవార్డు వచ్చిన దానికంటే ఆనందంగా ఉంది. నా సినిమా చూడటమే కాకుండా దాన్ని ఎనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నా’ అన్నారు రాజమౌళి. ఫైనల్‌‌గా ‘మీరెప్పుడైనా హాలీవుడ్‌‌లో సినిమా చేయాలనుకుంటే నాతో చెప్పండి.. మాట్లాడుకుందాం’ అంటూ ఆఫర్ ఇచ్చారు కేమరూన్. ఈ గోల్డెన్ ఆఫర్‌‌‌‌ చూస్తుంటే.. రాజమౌళి హాలీవుడ్‌‌లో సినిమా చేసే రోజు అతి దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.