'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ పుకార్లపై రాజమౌళి కొడుకు స్ట్రాంగ్ రిప్లై

'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ పుకార్లపై రాజమౌళి కొడుకు స్ట్రాంగ్ రిప్లై

'ఆర్ఆర్ఆర్'తో సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మూవీ ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 12న జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో పురస్కారం అందుకుంది. ఈ అవార్డ్ కు నామినేట్ అయిన నుంచీ సినిమాపై పలు కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆస్కార్ ప్రచారానికి మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు నటులు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ టిక్కెట్ల కోసం మూవీ టీం భారీగా ఖర్చు చేసిందనే ప్రచారమూ జరిగింది. ఇప్పటివరకూ ఈ విషయంపై చిత్రబృందం ఏ రకంగానూ స్పందించలేదు. కానీ తాజాగా రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం టీమ్ చాలా డబ్బు ఖర్చు చేశారన్న రూమర్స్ అసలు ఎందుకు క్రియేట్ అయ్యాయో తనకు తెలియదన్నారు. సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో కచ్చితంగా ఆస్కార్‌ కోసం ప్రచారం చేయాలనుకున్నామని మాత్రం తెలిపారు. పబ్లిసిటీ బడ్జెట్‌ ప్రకారం ఖర్చు చేశామని, అన్నీ ప్లాన్‌ ప్రకారమే చేశామని స్పష్టం చేశారు.

‘‘డబ్బులిస్తే ఆస్కార్ కొనుక్కోవచ్చనడం పెద్ద జోక్" అన్న కార్తికేయ.. ఆస్కార్ అకాడమీ95 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ అని తెలిపారు. అక్కడ అంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుందన్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలను. - అభిమానుల ప్రేమను కొనుక్కోగలమా? సినిమా గురించి స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్‌ల మాటలను మనం కొనలేము కదా? స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అభిమానులే తమకు చాలా పబ్లిసిటీ ఇచ్చారని కార్తికేయ చెప్పుకొచ్చారు.

ఇక అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన వారి కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ టిక్కెట్లను స్పాన్సర్ చేసిందనే పుకార్లను సైతం కార్తికేయ ప్రస్తావించారు. "జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలను ఆస్కార్ కమిటీ ఆహ్వానించిందని తెలిపారు." నామినేట్ అయినందున నాటు నాటు స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని ఆయన వివరించారు.

నామినేషన్‌లో ఉన్నవారు లేదా కమిటీ పిలిచిన వారు కాకుండా ఎవరైనా ఉంటే ఆస్కార్ టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని కార్తికేయ చెప్పారు. దీని కోసం నామినీలు ఆస్కార్ కమిటీకి ఈ-మెయిల్ పంపాలన్న ఆయన.. అందులో భాగంగానే కీరవాణి తమ కుటుంబానికి ఆస్కార్ అని మెయిల్ చేశారన్నారు.  కాబట్టి తాము ప్రతి టిక్కెట్టును 1500 డాలర్లకు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. అదనంగా మరో 750 డాలర్లు ఖర్చు చేశామని చెప్పారు. తాము కొనుక్కునే వెళ్లామని, అదంతా అధికారికంగానే జరిగిందని ఎస్ఎస్ కార్తికేయ స్పష్టం చేశారు.