వరంగల్‍ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్​ ఎగ్జామ్స్

వరంగల్‍ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్​ ఎగ్జామ్స్
  •     ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
  •     సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం టెన్త్​ ఎగ్జామ్స్​ ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు ఇన్​టైంలో పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు.  అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. 

వరంగల్ :  వరంగల్‍  జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.   కలెక్టర్‍ ప్రావీణ్య ఖిలా వరంగల్‍ శంభునిపేట్‍ గవర్నమెంట్‍ హై స్కూల్‍లో,  డీఈఓ వాసంతి పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో 9448 రెగ్యూలర్‍, మరో  8 మంది ప్రైవేట్‍లో పరీక్షలు రాస్తున్నారు.  తొలిరోజు 9432 రెగ్యూలర్‍, 4గురు ప్రైవేట్‍ విద్యార్థులు  పరీక్షకు హాజరయ్యారు.  

హనుమకొండ జిల్లాలో కలెక్టర్‍ సిక్తా పట్నాయక్‍ హనుమకొండలోని మర్కజీ హై స్కూల్‍, షైన్‍ స్కూళ్లల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. 12,014 మంది రెగ్యూలర్‍, మరో  ఆరుగురు  ప్రైవేట్ స్టూడెంట్లు పది పరీక్షలు రాయాల్సి ఉండగా.. సోమవారం రెగ్యూలర్‍ 12 వేల మంది, ప్రైవేట్‍లో నలుగురు హాజరయ్యారు.  16 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. 

ములుగు :  జిల్లాలో   21 పరీక్షా కేంద్రాల్లో 3088మంది విద్యార్థులకు  3081మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు డీఈవో జి.పాణిని తెలిపారు. విద్యార్థులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసినట్లు వెల్లడించారు. ములుగు మండలం జాకారం సోషల్ వెల్ఫేర్​ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్​ శ్రీజ పరిశీలించారు.    ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో   అనుమతించవద్దని, పరీక్షా విధుల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్​ అమలులో ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్​ పి.శబరీష్​ తెలిపారు. డీఎస్పీ రవీందర్​ పలు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 

మహబూబాబాద్ :  జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల్లో 8192 మంది విద్యార్థులకు  8173 మంది విద్యార్ధులు హాజరైనట్లు డీఈవో రామారావు తెలిపారు.      టౌన్​లో   కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్  జడ్పీహెచ్​ఎస్​  గర్ల్స్​, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించారు.  విద్యార్థులకు సందేహాలుంటే 9490556656 కు కాల్​ చేయొచ్చని తెలిపారు.   

జనగామ అర్బన్  : జిల్లాలో మొత్తం 41 ఎగ్జామ్​ సెంటర్లలో  స్టూడెంట్లు 6698 మంది స్టూడెంట్లకు  6687 మంది హాజరైనట్టు డీఈవో కె. రాము తెలిపారు. 11 ఎగ్జామ్​ సెంటర్లను అడిషనల్​ కలెక్టర్​ పర్మర్​ పింకేశ్​ కుమార్ సందర్శించారు.