
హైదరాబాద్, వెలుగు: టెన్త్ రీవెరిఫికేషన్, రీకౌం టింగ్ కోసం ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు ఈ ఏడాది ఆరువేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో రీకౌంటింగ్ కు 60 మాత్రమే వచ్చాయని పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. గతేడాది పదివేల వరకూ దరఖాస్తులు రాగా, ఈ సారి 4వేల దరఖాస్తులు తగ్గాయి.
మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు 5,06,202 మంది హాజరుకాగా, 4,67,859 మంది పాసయ్యారు. 2018-—–19లో రికార్డు స్థాయిలో టెన్త్ రిజల్ట్ నమోదు కావడంతోనే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తులు రాలేదని అధికారులు భావిస్తున్నారు. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను ఎప్పటికప్పుడు స్టూడెంట్లకు తెలియజేస్తామని, పదిరోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని సుధాకర్ ‘వెలుగు’తో చెప్పారు.