
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ప్రతిపాదిత ఐపీఓలో ప్రమోటర్ యూకే -ఆధారిత ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ ద్వారా 1.76 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది.
ఫ్రెష్ ఇష్యూ ఉండదు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ కాబట్టి, కంపెనీకి ఆదాయం రాదు. ప్రస్తుతం, ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ వద్ద ఉంది.