
- నల్గొండ జిల్లా చీకటిగూడెంలో ఘటన
కేతేపల్లి (నకిరేకల్ ), వెలుగు : ప్రమాదవశాత్తు కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన అల్దాసు జానయ్య(40) గీత కార్మికుడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారులో కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు.
ప్రమాదవశాత్తు అతడు చెట్టుపై నుంచి జారి కిందపడగా మెడకు మోకు బిగుసుకుని స్పాట్ లో చనిపోయాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదుతో కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.