హాసన్ పర్తి, వెలుగు: జేఈఈ మెయిన్– 2026 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ వరద రెడ్డి అన్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో గిందాం యువన్ చంద్ర 99.93 పర్సంటైల్ సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్టను జాతీయస్థాయిలో నిలబెట్టారని కితాబిచ్చారు.
అభినవ్ కేత 99.91 పర్సంటైల్, నిత్యంత్ రెడ్డి 99.84 పర్సంటైల్, మణికాంత్ వెలగ 99.77 పర్సంటైల్ సాధించారని చెప్పారు. ధీరజ్ కంచ 99. 70 పర్సంటైల్, చిట్టిమల్ల సాత్విక్ 99.68 పర్సంటైల్, గర్రెపల్లి వసుధ 99.64 పర్సంటైల్, చిన్నమేటి సందీప్ 99.55 పర్సంటైల్, చాతర్ల అరుణవ్ 99.48 పర్సంటైల్, మరికంటి గ్రీష్మంత్ తేజ్ 99.34 పర్సంటైల్ సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి, సంతోశ్ రెడ్డి అభినందించారు.
