బ్యాండ్ పోటీల్లో సెయింట్ ఆండ్రూస్, బోరబండ స్కూళ్ల హవా

బ్యాండ్ పోటీల్లో సెయింట్ ఆండ్రూస్, బోరబండ స్కూళ్ల హవా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలు–2026లో మేడ్చల్ జిల్లాలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బోరబండ రెసిడెన్షియల్ స్కూళ్లు సత్తా చాటాయి. శనివారం హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 60 జట్లు, 1,545 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

బ్రాస్ బ్యాండ్ బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ ప్రథమ స్థానంలో నిలవగా.. పైప్ బ్యాండ్ బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో బోరబండ టీజీఆర్ఈఐఎస్ స్కూళ్లు విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో పాల్గొన్న సమగ్ర శిక్ష ఏఎస్పీడీ పీవీ శ్రీహరి విద్యార్థులను అభినందించారు.