నాకు జాబిస్తారా.. మీరిచ్చినా చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు

నాకు జాబిస్తారా.. మీరిచ్చినా  చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు

న్యూయార్క్: ‘శుభ్రంగా ఉన్న ఏ ప్లేస్​నైనా కేవలం ముప్పై సెకండ్లలో చిందరవందర చేయడం నా స్పెషాలిటీ..ఇంకా డైపర్​ను సొంతంగా విప్పేసుకునే కెపాసిటీ నాకుంది.. ఇంకా బోలెడన్ని క్వాలిఫికేషన్లు నాకున్నయ్‌‌‌‌.ఇవన్నీ చూసి మీరు నాకు ఉద్యోగం ఇచ్చేస్తానంటారేమో. మీరిచ్చినా జాబ్‌‌‌‌ చేసే ఇంట్రెస్ట్​ నాకు లేనే లేదు.. ఎందుకంటే, ఇంట్లో ఉన్న శ్నాక్స్ డబ్బా ఖాళీచేయడానికే నాకు టైమ్​ సరిపోదు’..– ఇదీ ఓ బుడతడి అప్లికేషన్‌‌‌‌. టిప్​టాప్​గా తయారై  అమ్మతో పాటు ఇంటర్వ్యూకు వెళ్తూ ఈ అప్లికేషన్‌‌‌‌ పట్టుకెళ్లాడు. 

అమెరికాలోని సెయింట్​లూయీ​ సిటీలో ఉంటుంది మ్యాగీ. ఆమెకి రెండేండ్ల కొడుకు ఉన్నాడు. కరోనా ఎఫెక్ట్​తో తన జాబ్​ పోయింది. నాలుగైదు కంపెనీలకురెస్యూమె పంపిస్తే ఓ కంపెనీ ఇంటర్వ్యూకు పిలిచింది. అయితే, కొడుకును చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటర్వ్యూకు ఎలా వెళ్లాలోమ్యాగీకి అర్థంకాలే.. అదే విషయాన్ని కంపెనీ వాళ్లకు చెబితే, ‘పర్లేదు కొడుకును తీసుకునే రా’ అన్నారు. ఇంటర్వ్యూకి నేను ఒక్కదాన్నేనా, వీడ్ని కూడారెడీ చేస్తా అనుకుని సరదాగా  కొడుకును కూడా ఇంటర్వ్యూకు రెడీ చేసింది. సూటు, బూటు వేసి, టై కట్టడంతో పాటు ఓ అప్లికేషన్‌‌‌‌​ కూడా వాడి తరఫునరాసేసింది. అమ్మ చేయి పట్టుకుని మెట్లమీది నుంచి కిందికి దిగడం లాంటి క్వాలిఫికేషన్లు కూడా ఉన్నాయని రాసింది. మమ్మీ డాడీ యూనివర్సిటీలోచదువుతున్నట్లు కూడా రాసింది. ఇంటర్వ్యూ రోజున వాడిని రెడీ చేస్తూ ఓ వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్​గా మారింది. ఏకంగా 87 లక్షల మందిఈ వీడియోను చూసి మెచ్చుకుని కామెంట్లు పెట్టారు. కొడుకుతో పాటే ఇంటర్వ్యూకు రమ్మని పిలిచినందుకు కంపెనీని కూడా చాలా మందిమెచ్చుకున్నరు. అన్నట్టు.. కంపెనీ వాళ్లు మ్యాగీకి జాబ్​ ఆఫర్​  ఇచ్చారు కానీ అనుభవంలేదని బుడ్డోడికి మాత్రం ఉద్యోగం ఇవ్వలేమన్నారట. అయినా వాళ్లకు ప్రాబ్లమేముంది జాబ్​ ఇస్తామన్నా వీడు చేయడుగా!