స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 14 కింద నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, 12వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 13న ప్రారంభమై మే 4న ముగుస్తుంది.
పోస్ట్ పేరు: నర్సింగ్ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 127.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 13.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీలకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 4.
ఆన్ లైన్ ఎగ్జామ్ (తాత్కాలికం): 2026, జూన్
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.in ను సందర్శించండి.
ఆన్‌లైన్ పరీక్షా విధానం
ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

