
హైదరాబాద్, వెలుగు: రైతు బజార్లల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ స్టాల్స్‌ను పూర్తిగా మహిళలకు మాత్రమే కేటాయించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.