
పద్మారావునగర్, వెలుగు: ఫుట్పాత్లు ఖాళీ చేయించడంతో తాము రోడ్డున పడ్డామని సికింద్రబాద్ వద్ద షాపులు నడుపుతున్న స్టాంప్ వెండర్స్, టైపిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వారు కలిశారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న తమను ఉన్నట్టుండి ఖాళీ చేయించడంతో ఉపాధి కోల్పోయామని చెప్పారు.
వెంటనే తలసాని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.