విజయ్ లేట్గా రావడం వల్లే తొక్కిసలాట.. తమిళనాడు డీజీపీ జి.వెంకట్రామన్

విజయ్ లేట్గా రావడం వల్లే తొక్కిసలాట..  తమిళనాడు డీజీపీ జి.వెంకట్రామన్
  • 10 వేల మందితోనే ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నరు

చెన్నై: కరూర్ లో సినీనటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ర్యాలీలో కేవలం 10 వేల మంది మాత్రమే పాల్గొంటారని పర్మిషన్ తీసుకున్నా రని, కానీ, ఆ సంఖ్యకు మించి అభిమానులు వస్తారని తాము అంచనా వేశామని తమిళ నాడు డీజీపీ జి.వెంకట్రామన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కారణాలపై డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 'టీవీకే సోషల్ మీడియాలో విజయ్ వాస్తవంగా వచ్చిన సమయం కంటే.. చాలా ముందుగా మధ్యాహ్నం 3 గంటలకే వస్తారని ప్రకటించారు. 

కానీ రాత్రి 7.30కి వచ్చారు. దీంతో ఆ ప్రదేశంలో భారీగా ఫ్యాన్స్ చేరుకుని ఎదురు చూశారు. అధికారులు ఈ కార్యక్రమానికి 1.2లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. గతంలో అన్నాడీఎం కే ర్యాలీ అక్కడ జరిగింది. ఘటనా స్థలానికి వెంటనే 2 వేల మంది సిబ్బందిని సీనియర్ పోలీసు అధికారులను పంపించాం. ఏక సభ్య కమిషన్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది' అని డీజీపీ వెల్లడించారు.

ఇద్దరు విజయ్ సహాయకులపై కేసు

టు వెలడించారు. కరూర్లో తొక్కిసలాట ఘటనపై సినీనటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు  చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్చేశారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎస్ డేవిడ్సన్ ధ్రువీకరిం చారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


ఘటన వెనక కుట్రకోణం..


మరోవైపు ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని టీవీకే ఆరోపిస్తోంది. కరూర్ తొక్కిసలాటపై టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొంది. ఇదొక సాధారణ ప్రమాదం కాదని.. అందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్య క్తంచేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ చే పట్టేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. కాగా నిన్న జరిగిన ఘటనలో 39 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.