చెన్నై వరదల్లో చిక్కికున్న స్టార్ హీరో అమీర్ ఖాన్, విష్ణు విశాల్

చెన్నై వరదల్లో చిక్కికున్న స్టార్ హీరో అమీర్ ఖాన్, విష్ణు విశాల్

చెన్నై వరదల్లో బాలీవుడ్ హీరో అమీర్‌ ఖాన్‌(Aamir khan) చిక్కుకున్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌ తమిళనాడుతోపాటు ఏపీ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ కారణంగా వస్తున్న వరదల్లో సాధారణ ప్రజలతో పాటు.. సెలబ్రిటీలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో  అమీర్‌ ఖాన్‌ చెన్నై వరదల్లో చిక్కుకోవడం వైరల్ గా మారింది. ఆయనతోపాటు తమిళ హీరో విష్ణు విశాల్‌ ఫ్యామిలీ కూడా  ఈ వరదల్లో చుక్కికున్నారు. కరపాకంలోని తమ ఇంట్లోకి వరద నీళ్లు చేరి, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది. 

ఎట్టకేలకు హీరో విష్ణు విశాల్‌ తన ఇంటి మేడ మీదకు ఎక్కి తమ పరిస్థితిని వివరిస్తూ ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. తమతోపాటు చాలా మంది వరదల్లో ఇరుక్కున్నారని, వెంటనే తమకు సహాయం అందించాలని కోరారు. దాంతో వెంటనే స్పందించిన అధికారులు.. రెస్య్కూ సిబ్బందిని పంపించి.. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వీరితోపాటు  అమీర్‌ ఖాన్‌ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనంతరం పడవలపై తమను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో  పంచుకున్న విష్ణు విశాల్‌.. ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. 

Also Read:-Chaaver Movie Review: ఓ హత్య చుట్టూ తిరిగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్