
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాస బసు(Bipasha Basu), హీరో కరణ్ సింగ్ గ్రోవర్(Karan Singh Grover)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో వీరిపెళ్లి జరగగా.. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు జన్మనిచ్చింది బిపాస. తమ గారాల పట్టికి "దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును పెట్టుకున్నారు ఈ జంట.
ఇక తాజాగా ఆపాపకి అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తమ అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు బిపాసా, కరణ్ కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.
ఇక బిపాస బసు, హీరో కరణ్ సింగ్వా సినిమాల విషయానికి వస్తే, బిపాస బసు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుండగా.. కరణ్ సింగ్ గ్రోవర్ మాత్రం హృతిక్(Hrithik Roshan)-దీపికా(DeepikaPadukone) కాంబోలో వస్తున్న ఫైటర్(Fighter) మూవీలో ఓకే కీ రోల్ లో కనిపిస్తున్నాడు.