SA20 Final: కావ్య మారన్ vs గంగూలీ: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

SA20 Final: కావ్య మారన్ vs గంగూలీ: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

నెల రోజులు అభిమానులను అలరించిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ ఆదివారం (జనవరి 25) జరగనుంది. ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండుసార్లు ఛాంపియన్‌ సన్‌రైజర్స్.. మూడో సారి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు తొలిసారి టైటిల్ కోసం ప్రిటోరియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీ ఉండడం.. మరోవైపు సన్ రైజర్స్ జట్టుకు కావ్యమారన్ ఓనర్ గా ఉండడంతో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. 

ట్రిస్టన్ స్టబ్స్ సన్ రైజర్స్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు ప్రిటోరియా క్యాపిటల్స్ ను కేశవ్ మహరాజ్ లీడ్ చేయనున్నాడు. క్వింటన్ డి కాక్(w), జానీ బెయిర్‌స్టో, జోర్డాన్ హెర్మాన్, మాథ్యూ బ్రీట్జ్కే లాంటి స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ లో చెలరేగితే సన్ రైజర్స్ కు విజయం ఖాయం. షాయ్ హోప్, బ్రైస్ పార్సన్స్, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డెవాల్డ్ బ్రెవిస్ లతో క్యాపిటల్స్ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ విషయానికి వస్తే రెండు జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి.       

లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?

ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మధ్య జరిగే ఫైనల్ డిస్నీ + హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.. లైవ్ టెలికాస్టింగ్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.   

స్క్వాడ్‌లు:

సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: 

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, జోర్డాన్ హెర్మాన్, మాథ్యూ బ్రీట్జ్కే, జేమ్స్ కోల్స్, ట్రిస్టన్ స్టబ్స్(c), మార్కో జాన్సెన్, క్రిస్ గ్రీన్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, లూథో సిపామ్లా, క్రిస్టోఫర్ కింగ్, JP కింగ్, పాట్రిక్ క్రుగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, మిచెల్ వాన్ బ్యూరెన్, క్రిస్ వుడ్, లూయిస్ గ్రెగొరీ, అల్లా గజన్‌ఫర్

ప్రిటోరియా క్యాపిటల్స్ స్క్వాడ్:

షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రైస్ పార్సన్స్, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జోర్డాన్ కాక్స్, రోస్టన్ చేజ్, కేశవ్ మహారాజ్(కెప్టెన్), లిజాద్ విలియమ్స్, లుంగి న్గిడి, గిడియన్ పీటర్స్, ఆండ్రీ రస్సెల్, కోడి యూసుఫ్, మీకా ఈల్ ప్రిన్స్, డేనియల్ స్మిత్, విల్ స్మీడ్, టైమల్ మిల్స్, సిబోనెలో మఖన్యా, విహాన్ లుబ్బే, కీత్ డడ్జియన్, జునైద్ దావూద్