నేటి నుంచి ప్యాసింజర్ రైళ్లు

నేటి నుంచి ప్యాసింజర్ రైళ్లు

 ఢిల్లీ నుంచి 15 సిటీలకు సర్వీసులు
 ఆయా సిటీల నుంచి మళ్లీ ఢిల్లీకి..
సోమవారం నుంచి బుకింగ్ ప్రారంభం
స్టేషన్లలో స్క్రీనింగ్.. కరోనా లక్షణాలు లేకుంటేనే పర్మిషన్
మాస్కులు వేసుకోవాలి.. సోషల్ డిస్టెన్స్ మస్ట్

సుమారు నెలన్నర తర్వాత ప్యాసింజర్ల రైళ్లు పట్టాలకెక్కనున్నాయి. మంగళవారం నుంచి 30 సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నుంచి పలు సిటీలకు బయల్దేరే ఈ రైళ్లు.. తర్వాత తిరిగి అక్కడి నుంచి ప్రయాణికులతో ఢిల్లీకి రానున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైంది. లాక్‌డౌన్ టైమ్‌లో కేవలం గూడ్స్ సర్వీసులకు మాత్రమే కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం నడిచే 15 రైళ్లతోపాటు తర్వాతి రోజుల్లో మరిన్ని రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రైల్వే ప్రకటించింది. ఈ 15 రైళ్లకు సంబంధించి ప్రయాణికులు పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్​వోపీ)ను రిలీజ్ చేసింది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

టికెట్ కన్ఫామ్ అయిన వాళ్లు మాత్రమే స్టేషన్‌కు రావాలి.
ప్రయాణానికి గంటన్నర ముందే చేరుకోవాలి.
ప్యాసింజర్లకు స్క్రీనింగ్ చేస్తారు. అందులో నెగెటివ్ అని తేలితేనే ప్రయాణానికి పర్మిషన్.
స్టేషన్, బోగీలో శానిటైజర్లు ప్రొవైడ్ చేస్తారు.
తక్కువ లగేజీ తెచ్చుకోవాలి.
మాస్కులు వేసుకోవాలి.
సోషల్ డిస్టెన్స్ మస్ట్​గా పాటించాలి.
ప్యాసింజర్లు తమ డెస్టినేషన్లకు చేరుకున్న తర్వాత.. అక్కడ ఆయా రాష్ర్టాలు సూచించిన హెల్త్ ప్రోటోకాల్స్​కు కట్టుబడి ఉండాలి.

ఏయే సిటీలకు వెళ్తాయంటే..?

సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి, డిబ్రూగఢ్​, హౌరా, బిలాస్‌పూర్, పాట్నా, రాంచి, భువనేశ్వర్, మడ్గావ్, అగర్తాలా సిటీలకు ఢిల్లీ నుంచి రైళ్లు బయలేదేరతాయి. తర్వాత ఈ 15 సిటీల నుంచి ఆయా రైళ్లు తిరిగి ఢిల్లీకి వెళ్తాయి.