ఇవాళ కూకట్‌పల్లి ఫ్లై ఓవర్‌ ప్రారంభం

ఇవాళ కూకట్‌పల్లి ఫ్లై ఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్ మలేషియన్‌ టౌన్‌ షిప్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం నుండి JNTU వరకు  ఈ రోజు(శనివారం) ఫ్లై ఓవరును ప్రారంభించారు అధికారులు. ఈ మార్గంలో నిర్మాణం పూర్తి అయిన‌ప్ప‌టికీ ఇంకా ప్రారంభించ‌క‌పోవ‌డంతో, ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్‌, ఈమెయిల్స్ ద్వారా నెటిజన్లు GHMC అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున నిర్మాణం పూర్తి అయినా… ఈ ఫ్లైఓవ‌ర్‌ ను అధికారికంగా ప్రారంభించ‌డానికి అధికారులు నిరాక‌రించారు. అధికారికంగా కాక‌పోయిన ఈ ఫ్లైఓవ‌ర్‌ను వెంట‌నే రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని వంద‌లాది మంది సోషల్ మీడియాల వేదిక ద్వారా విజ్ఞ‌ప్తి చేసారు. దీంతో ఇవాళ ఈ ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపేట్, ప్రగతి నగర్, కూక‌ట్‌ ప‌ల్లి నుండి హైటెక్ సిటీకి  రెండు వైపులా రోజుకు దాదాపు లక్షా అరవై వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.